మంత్రి దినేశ్ గుండూరావు క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:05 AM
స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు...
నోటీసులు పంపిన సావర్కర్ ముని మనవడు
బెంగళూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావుకు సావర్కర్ ముని మనవడు సాత్యకి సావర్కర్ నోటీసులు పంపారు. ఇటీవల గాంధీ జయంతి రోజున బెంగళూరులో ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సావర్కర్ గోవధకు వ్యతిరేకం కాదని, ఆయన గొడ్డుమాంసం తినేవారని వ్యాఖ్యానించారు. సావర్కర్‌ను మహ్మద్ అలి జిన్నాతో పోల్చారు. దీంతో సాత్యకి సావర్కర్ నోటీసులు పంపారు. అందులో 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్టు తెలిసింది.