Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం
ABN , Publish Date - Jun 15 , 2024 | 06:43 AM
వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది.
నిర్వహించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది. ఇందులో 62 బ్లాకులను అమ్మకానికి పెడుతారని తెలిపింది. బొగ్గును ఎవరు వినియోగిస్తారన్నదానితో సంబంధం లేకుండా గనుల కేటాయింపు ఉంటుం ది. పూర్తి పారదర్శకతతో వేలం జరుపుతామని, గరిష్ఠ ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్‌రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టగా శుక్రవారం తొలిసారిగా బొగ్గు, గనుల శాఖల అధికారులతో సమావేశమయి సమీక్ష జరిపారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లను కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబేతో కలిసి వారి వద్దకు వెళ్లారు.