Home » PresidentMurmu
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హాజరయ్యారు. భద్రతా సిబ్బంది మధ్య ఉదయం త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్, చల్లా గుణరంజన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.
వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రోజు (గురువారం)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Murmu) బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) కలిశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.