Share News

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:13 PM

అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమేనని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప(Minister Muniyappa) కీలక వ్యాఖ్యలు చేశారు

 Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

- మంత్రి మునియప్ప

బెంగళూరు: అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమేనని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప(Minister Muniyappa) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కోలారులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార ఒప్పందానికి సంబంధించి ఒప్పందం జరిగిందన్నారు. డీసీఎం డీకే శివకుమార్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనన్నారు. అంతకుమించి మరే విషయాలు అడగరాదని దాటవేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు


దీన్నిబట్టి డీసీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీలో ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశాలు వాస్తవమని మునియప్ప ద్వారా బహిరంగమైంది. అయితే సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మాత్రం అటువంటి ఒప్పందాలు ఏవీ లేవని అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతామన్నారు.

pandu1.2.jpg

సీఎం, డీసీఎంల వ్యాఖ్యలు భిన్నంగా ఉండగా మంత్రి మునియప్ప వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి మార్పు ఉందనేది స్పష్టమైంది. కానీ అధికార పంపిణీలో ఒప్పందం జరిగి ఉంటే వారిద్దరే రాజకీయాలు చేసుకోవచ్చునని, మేమంతా ఎందుకంటూ హోం మంత్రి పరమేశ్వర్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 12:13 PM