Share News

Minister: మహిళలు, చిన్నారులపై వేధింపులు సహించం..

ABN , Publish Date - Nov 27 , 2024 | 01:29 PM

మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను ఈ ప్రభుత్వం సహించదని, దేశంలోనే మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్‌(Minister Geethajeevan) స్పష్టం చేశారు.

Minister: మహిళలు, చిన్నారులపై వేధింపులు సహించం..

- వారి భద్రతలో రాష్ట్రం ముందంజ

- నటుడు విజయ్‌కు మంత్రి గీతాజీవన్‌ కౌంటర్‌

చెన్నై: మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను ఈ ప్రభుత్వం సహించదని, దేశంలోనే మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్‌(Minister Geethajeevan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా వేధింపులు అధికమవుతున్నాయని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: అతనెవరు.. మమ్మల్ని కొన్నారా...


దానిపై మంత్రి స్పందిస్తూ... మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ పనులు చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఉన్నత విద్య అభ్యసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న, స్వీయ మర్యాదతో రాష్ట్ర మహిళలున్నారన్నారు. దేశంలోని ఉత్పత్తుల రంగంలో 43 శాతం మంది రాష్ట్ర మహిళలు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రం లో 241 మహిళా పోలీసుస్టేషన్లు, 32 కిడ్నాపింగ్‌ నిరోధక యూనిట్లు, 7 దర్యాప్తు బృందాలు, 43 పిల్లల వేధింపుల నిరోధక బృందాలు, 39 స్పెషల్‌ జువైనల్‌ పోలీసు యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు.


మైనర్లపై జరిగే నేరాలు పరిష్కరించేలా రాష్ట్రంలోని అన్ని మహిళా పోలీస్‏స్టేషన్‌లలో 194 జువైనల్‌ ఫెండ్రీ సెల్స్‌, 1,542 చైల్డ్‌ వెల్ఫేర్‌ పోలీసు అధికారులు పనిచేస్తున్నారన్నారు. అలాగే, మహిళలు ఫిర్యాదు చేసేలా ‘కావల్‌ ఉదవి’ యాప్‌, 181, చిన్నారుల కోసం 1098 అనే నెంబర్లు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ నేరాల కమిషన్‌ విడుదల చేసిన ప్రకటనలో... 2022లో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు దేశవ్యాప్తంగా 1.65 లక్షలు కాగా, రాష్ట్రం లో 24 మాత్రమే జరిగినట్లు తెలిసిందన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గీతాజీవన్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 01:31 PM