MLA: సినిమా హీరోలకు ఉన్న గౌరవం తల్లిదండ్రులకు లేదు..
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:04 PM
నేటి యువత అధికశాతం మంది కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అయితే సినిమా హీరోల బ్యానర్లు, కటౌట్‌లకు క్షీరాభిషేకం చేస్తున్నారని ఎమ్మెల్యే సుబ్బారెడ్డి(MLA Subba Reddy) విచారం వ్యక్తం చేశారు.
- ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విచారం
బెంగళూరు: నేటి యువత అధికశాతం మంది కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అయితే సినిమా హీరోల బ్యానర్లు, కటౌట్‌లకు క్షీరాభిషేకం చేస్తున్నారని ఎమ్మెల్యే సుబ్బారెడ్డి(MLA Subba Reddy) విచారం వ్యక్తం చేశారు. తాలూకాలోని పూలవారిపల్లి గ్రామ శివారులోని మొరార్జీదేశాయ్ వసతి పీయూ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ హీరోలకు ఇస్తున్న విలువ తల్లిదండ్రులకు లేకుంటే ఎలాగని ఈధోరణి మారాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP MLC CT Ravi: నేనేమైనా ఉగ్రవాదినా.. అప్రమత్తంగా లేకపోతే ఎన్‌కౌంటర్ చేసేవారు
హీరోపై అభిమానం తప్పుకాదని అయితే కన్నవారిని గౌరవించకపోవడం, నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పిల్లల ఉజ్వలభవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారని వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలతో మంచి హోదాలలోకి రావాలని అభిలషించారు. గుణాత్మక విద్యకోసం వసతి పాఠశాలలకు రూ.200కోట్లు గ్రాంటు తెచ్చి అభివృద్ధి చేస్తున్నానని, ప్రస్తుతం 146మందికి ట్యాబ్‌లు, నీట్, జేఈఈ, సీఈటీ పుస్తకాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి తేజానందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 24 వసతి పాఠశాలల్లో ఉన్నా బాగేపల్లి నియోజకవర్గంలో వందశాతం వసతి పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. విద్యాప్రగతి కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందుకు ప్రతిగా పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ సహాయక డైరెక్టర్ శేషాద్రి, గుడిబండ లక్ష్మీపతిరెడ్డి, పురసభ సభ్యులు శ్రీనివాసరెడ్డి, గడ్డం రమేశ్, జిల్లా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పూజప్ప, మాజీ సభ్యుడు నరసింహప్ప, కేడీపీ సభ్యుడు మంజునాథరెడ్డి, మొరార్జీదేశాయ్ వసతి పీయూ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News