Share News

Article 370: అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:55 AM

పిడి గుద్దులు గుద్దుకుంటూ సభలో వాగ్వాదానికి దిగారు. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370పై బ్యానర్‌ను ప్రదర్శించడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆ తర్వాత, బ్యానర్ ప్రదర్శనపై ..

Article 370: అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
J&K Assembly

ఆర్టికల్ 370పై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇవాళ తీవ్ర రచ్చ జరిగింది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకుంటూ సభలో వాగ్వాదానికి దిగారు. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370పై బ్యానర్‌ను ప్రదర్శించడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆ తర్వాత, బ్యానర్ ప్రదర్శనపై శాసనసభలో విపక్ష నేత బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం జరిగిన వెంటనే మార్షల్స్‌ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలను నిువరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రైనా స్పందిస్తూ, ఎన్‌సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ కా హాత్‌ పాకిస్థాన్‌ కే సాత్‌, కాంగ్రెస్‌ కే హాత్‌ టెర్రరిస్టుల కే సాత్‌ అని విమర్శించారు.


ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని తీర్మానం

జమ్మూ కాశ్మీర్ శాసనసభలో బుధవారం ఆర్టికల్ 370 పునరుద్ధరణ తీర్మానంపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370ను 2019 ఆగష్టు5న రద్దు చేసింది. ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేయడంతో బీజేపీ సభ్యులు తీర్మాన ప్రతులను చించి శాసనసభ వెల్ లోకి విసిరారు. ఈ సమయంలో షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. తీర్మానాన్ని ఆమోదించాలంటూ ఎన్‌సీ సభ్యులు నినాదాలు చేశారు.


బీజేపీ వర్సెస్ ఎన్సీ

ఆర్టికల్ 370 పునరుద్దరించాలంటూ పీడీపీ, ఎన్సీ కోరుతున్నాయి. మరోవైపు ఎన్సీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కాలేదు. పీడీపీ 370 పునరుద్దరణ కోసం శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేయగా.. తాజాగా ఎన్సీ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించడంతో.. ఎన్సీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి. ఎన్సీ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 07 , 2024 | 11:04 AM