Share News

Modi Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Sep 11 , 2024 | 09:11 PM

దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.

Modi Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.

Also Read: Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం


మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. వయో వృద్ధుల కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవత్వంతో కూడినదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు.

Also Read: Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్


అలాగే ఢిల్లీ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం - 4కి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీంతో రానున్న ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ. 25 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 12,461 కోట్ల కేటాయించిన బడ్జెట్ ప్రతిపాదనలకు సైతం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం చెప్పిందన్నారు.

Also Read: HYDRA: 111.72 ఎకరాల భూమి స్వాధీనం


అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తుందని తెలిపారు. అందులోభాగంగా రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటునందించనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Also Read: Telugu States: వరద నష్టంపై నివేదిక అందజేత

Also Read: Jammu and Kashmir: జైలు నుంచి విడుదలైన ఎంపీ ఇంజనీర్ రషీద్

Also Read: Sonia Gandhi: సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 11 , 2024 | 09:12 PM