Share News

PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

ABN , Publish Date - Dec 15 , 2024 | 11:46 AM

సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.

PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదింప చేసేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా లోక్‌సభ బిజినెస్‌లో సైతం సదరు బిల్లుతోపాటు మరో బిల్లు ఆమోదింప చేసుకొనేందుకు కేంద్రం పొందు పరిచింది. కానీ చివరి నిమిషంలో లోక్‌సభ బిజినెస్‌లో నుంచి ఆ రెండు బిల్లులను తొలగించింది. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.

Also Read: కేసీఆర్ ఫ్యామిలీ నాటకం.. యువత బలిదానాలకు కారణం


వెనక్కి తగ్గిన కేంద్రం..!

ఈ బిల్లుపై మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి. అంటే.. వచ్చే శుక్రవారంతో సభ దీర్ఘ కాలం పాటు వాయిదా పడనుంది. ఈ నేపథ్యంలో ఈ కాలవ్యవధిలోనే బిల్లులు ఆమోదింప చేసుకొనేందుకు మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి వేళ.. ఇలా చివరి నిమిషంలో బిల్లు ఆమోదంపై వెనక్కి తగ్గడంపై పలు సందేహాలకు తావిస్తోంది.

Also Read: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్


డిసెంబర్ 16న..

నవంబర్ 25వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ ముందుకు ఈ బిల్లును సోమవారం అంటే డిసెంబర్ 16వ తేదీ తీసుకు వచ్చేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఆ క్రమంలో లోక్‌సభ బిజినెస్‌లో సైతం దీనిని పొందు పరిచింది.

Also Read: నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం


కేంద్ర మంత్రులు సైతం..

ఈ బిల్లుతో పాటు మరో బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభలో ప్రవేశపెడతారని ఇప్పటికే కేంద్రం సైతం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. అయితే లోక్‌సభలో బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించింది. రివైజ్ చేసిన లోకసభ బిజినెస్‌లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులు లేవు. ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లులు పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అలాంటి వేళ.. ఈ బిల్లు ఆమోదింప చేసుకొనేందుకు మోదీ ప్రభుత్వం సందిగ్దంలో పడడంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.


ఎందుకంటే..

సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం జమిలి ఎన్నికల నిర్వహించాలని భావిస్తోంది. ఎందుకంటే.. ప్రతి ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతునే ఉంటాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం.. అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అంతా ఆయా ఎన్నికల క్రతువులో పాల్గొంటున్నాయి.


ఆ సమస్యల నుంచి..

దాంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతోన్నాయి. ఈ తరహా సమస్యల నుంచి బయట పడేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ బిల్లును ఆమోదింప చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి వేళ.. ఇలా చివరి నిమిషంలో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం పట్ల పలు సందేహాలకు తావిస్తోంది.

For National News And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 11:48 AM