Share News

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు..ఎప్పుడంటే

ABN , Publish Date - Dec 16 , 2024 | 06:22 PM

'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు..ఎప్పుడంటే

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లు (One Nation, One Election Bill) డిసెంబర్ 17వ తేదీ మంగళవారంనాడు లోక్‌సభ (Lok Sabha) ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Meghwal) ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఇంతకుముందు డిసెంబర్ 16వ తేదీన లోక్‌సభ బిజినెస్‌లో ఈ బిల్లు చేర్చారు. బిల్లును అధ్యయనం చేసేందుకు వీలుగా ఎంపీలకు బిల్లు ప్రతులను కూడా ప్రభుత్వం సర్క్యులేట్ చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి.

Trinamool Congress: ఈవీఎంలపై ఆరోపణలు చేస్తే సరిపోదు, నిరూపించాలి: టీఎంసీ


బిల్లుకు మోదీ క్యాబినెట్ ఆమోదం

'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని, ప్రభుత్వ పథకాల అమలుకు కూడా ఎలాంటి అవరోధం ఉండదని అంటోంది. ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని ప్రధానమంత్రి మోదీ ఇటీవల పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు.


కాగా, ప్రస్తుతానికి లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు మాత్రమే పరిమితం కావాలని కేబినెట్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను ప్రస్తుతానికి మినహాయించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచారం. జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందువల్ల దేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని టీఎంసీ చెబుతుండగా, జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ అంటోంది.


ఇవి కూడా చదవండి...

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..

Updated Date - Dec 16 , 2024 | 06:22 PM