Share News

Punjab : పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల సంచారం.. హై అలెర్ట్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:47 AM

భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్‌ ప్రకటించారు.

Punjab : పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల సంచారం.. హై అలెర్ట్‌

పఠాన్‌కోట్‌, జూన్‌ 26: భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్‌ ప్రకటించారు. గ్రామాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సరిహద్దు రేంజి డీఐజీ రాకేశ్‌ కౌశల్‌ మాట్లాడుతూ... గత రాత్రి ఇద్దరి అనుమానాస్పద కదలికలను గుర్తించామన్నారు.

ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు. బీఎ్‌సఎఫ్‌, సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌ ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించామని పఠాన్‌కోట్‌ ఎస్‌ఎ్‌సపీ సుహైల్‌ ఖాసిం మిర్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా, జమ్మూ-కశ్మీర్‌లోని దోదా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Updated Date - Jun 27 , 2024 | 07:04 AM