Share News

Music director: నేను విజయకాంత్‌కు రుణపడివున్నా..

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:37 AM

తన సినీ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ‘వారారు వారారు అళగర్‌ వారారు’ అనే పాట తనకు మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని దానికి కెప్టెన్‌ విజయకాంత్‌(Captain Vijayakanth)కు రుణపడివున్నానని ప్రముఖ సీనియర్‌ సంగీత దర్శకుడు దేవా(Senior music director Deva) అన్నారు.

Music director: నేను విజయకాంత్‌కు రుణపడివున్నా..

- సంగీత దర్శకుడు దేవా

చెన్నై: తన సినీ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ‘వారారు వారారు అళగర్‌ వారారు’ అనే పాట తనకు మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని దానికి కెప్టెన్‌ విజయకాంత్‌(Captain Vijayakanth)కు రుణపడి వున్నానని ప్రముఖ సీనియర్‌ సంగీత దర్శకుడు దేవా(Senior music director Deva) అన్నారు. దేవా ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ మదురైలో మ్యూజికల్‌ నైట్‌ జరుగనుంది. ఈ వివరాలను ఆయన తాజాగా వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Crocodiles: సాత్తనూరు డ్యాం నుంచి తప్పించుకున్న మొసళ్లు..


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మదురైలో ప్రతియేటా జరిగే చిత్తిరై వేడుకల్లో ‘వారారు వారారు అళగర్‌ వారారు’ పాట వినిపిస్తూనే ఉంటుంది. నేను ఎన్నో పాటలు పాడినప్పటికీ ఈ పాటతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో దివంగత నటుడు విజయకాంత్‌కు రుణపడివుంటాను. ఈ పాటను నేను తొలిసారి మదురై గడ్డపై లైవ్‌లో పాడనున్నాను. ఈ అవకాశాన్ని కూడా విజయకాంత్‌ కల్పించారు.


nani5.2.jpg

మదురైలో జరిగే సంగీత విభావరిలో నాతో పాటు గాయకులు మనో, అనురాధా శ్రీరామ్‌, అజయ్‌ కృష్ణ, సబేష్‌, మురళి, శ్రీకాంత్‌ దేవా సహా దాదాపు 60 మంది వరకు పాల్గొంటారు. తరాలు మారినప్పటికీ నాది, ఇళయరాజా సంగీతం స్థిరస్థాయిగా నిలిచిపోయినందుకు ధన్యుడుని. యంగ్‌ జనరేషన్‌లో అనిరుధ్‌ సంగీతం ఇష్టం. అనేక చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చినా నేను అంగీకరించలేదు. సంగీత దర్శకుడుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేయాలని ఇష్టపడుతున్నాను’ అని పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 11:37 AM