Maharashtra: సీఎంను కలిసిన విపక్ష నేతలు.. ఆ పదవి తమకు కేటాయించాలని విజ్ఞప్తి
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:15 PM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను విపక్ష 'మహా వికాస్ అఘాడి' నేతలు ఆదివారంనాడు కలిసారు. ఎంవీఏ ప్రతినిధులు బృందానికి శివసేన (యూబీటీ) నేత భాస్కర్ జాదవ్ నాయకత్వం వహించారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis)ను విపక్ష 'మహా వికాస్ అఘాడి' (MVA) నేతలు ఆదివారంనాడు కలిసారు. విపక్ష కూటమిలోని పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు విపక్షం సహకరిస్తుందని, ప్రోటోకాల్ ప్రకారం తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎంను వారు కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన ఎంవీఏ ప్రతినిధి బృందానికి శివసేన (యూబీటీ) నేత భాస్కర్ జాదవ్ నాయకత్వం వహించారు.
Sharad Pawar: బ్యాలెట్ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు
మరోవైపు, శనివారంనాడు ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సహా 171 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఏంల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రమాణస్వీకారాన్ని 'మహా వికాస్ అఘాడి' నేతలు బహిష్కరించారు. ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు ప్రజాతీర్పే అయితే ప్రజలు సంబరాలు చేసుకునే వారని, ప్రజలు ఎక్కడా అలాంటి సంబరాలు చేసుకోవడం లేదని విపక్ష నిర్ణయంపై శివసేన యూబీటీ నేత ఆదిత్య థాకరే వివరణ ఇచ్చారు.
కాగా, ప్రమాణస్వీకారాన్ని ఎంవీఏ బహిష్కరించడాన్ని ఎన్‌సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ విమర్శించారు. సభలో ప్రమాణస్వీకారం చేసినప్పుడే సభా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనగలుగుతారని అన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక డిసెంబర్ 9న జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు
Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!
Read More National News and Latest Telugu News