Share News

Mani Shankar Aiyar: నా ఎదుగుదల, పతనానికి గాంధీ ఫ్యామిలీనే కారణం: మణిశంకర్ అయ్యర్

ABN , Publish Date - Dec 15 , 2024 | 07:18 PM

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2012లో పార్టీకి రెండు సంక్షోభాలు ఎదురయ్యాయని, సోనియాగాంధీ అనారోగ్యం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని అయ్యర్ అన్నారు.

Mani Shankar Aiyar: నా ఎదుగుదల, పతనానికి గాంధీ ఫ్యామిలీనే కారణం: మణిశంకర్ అయ్యర్

న్యూఢిల్లీ: రాజకీయాల్లో తాను ఎదగడానికి, పతనం కావడానికి కూడా గాంధీ కుటుంబమే కారణమని కాంగ్రెస్ సీనీయర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) అన్నారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యల్లో నిలిచే అయ్యర్ పలు సందర్భాల్లో పార్టీ నుంచి సస్పెండయ్యారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీని కలుసుకునేందుకు పదేళ్ల పాటు ప్రయత్నించినా తనకు అవకాశం లభించలేదని, ఆ తర్వాత రాహుల్ గాంధీతో ఒకసారి, ప్రియాంక గాంధీతో రెండుసార్లు మాట్లాడాడని 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ తెలిపారు. ప్రియాంక గాంధీ అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారని చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యుడనేనని, ఎప్పటికీ మారరని, బీజేపీ వైపు వెళ్లేది లేదని తెలిపారు.

Omar Abdullah: ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే... ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు


ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అయిన అయ్యర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా తాను సోనియాగాంధీని విషెస్ చెప్పేందుకు వెళ్లినప్పటి సందర్భాన్ని అయ్యర్ గుర్తుచేసుకున్నారు. ''నేను బయటకు వస్తూ సోనియాగాంధీకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను. నేను క్రిస్టియన్‌ను కాదని ఆమె అన్నారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. బహుశా తనను తాను క్రిస్టియన్‌గా ఆమె భావించి ఉండకపోవచ్చు. నేను కూడా ఫలానా మతానికి చెందిన వ్యక్తిగా భావించను. అలాగని మతాలను గౌరవించనని కాదు. అన్ని మతాలను నేను సమానంగా గౌరవిస్తాను'' అని అయ్యర్ చెప్పారు.


కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2012లో పార్టీకి రెండు సంక్షోభాలు ఎదురయ్యాయని, సోనియాగాంధీ అనారోగ్యం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని అయ్యర్ అన్నారు. అయినప్పటికీ ఆ రెండింటినీ ప్రణబ్ ముఖర్జీ సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లారని గుర్తుచేసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ అప్పట్లో తన బయోగ్రఫీలో తనను ప్రధానమంత్రిని చేసి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను భారత రాష్ట్రపతి పదవితో సముచిత గౌరవం కల్పిస్తారని ఊహించినట్టు చెప్పారని అయ్యర్ చెప్పారు. అదే జరిగి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అయితే 2014 లోక‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ మరీ అంత దారుణంగా 44 సీట్లకు పడిపోయి ఉండేది కాదని తనకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుందని అయ్యర్ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

For National News And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 07:18 PM