Modi 3.0: మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. టైమ్, డేట్ వివరాలివే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 09:52 PM
Narendra Modi Swearing as PM: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

శుక్రవారం నాడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు సమ్మతి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ సహా ఎన్డీయే కూటమిలోని నేతలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు విషయమై లేఖను అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన నరేంద్ర మోదీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి తనను ఆహ్వానించారని చెప్పారు. జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని రాష్ట్రపతికి తెలిపామని.. రాష్ట్రపతి భవన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటుందన్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే 272 మార్జిన్‌ను సాధించింది. వీటిలో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిగిలిన సీట్లు మిత్రపక్షాలకు చెందినవి. ఇదే బీజేపీ 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకుంది. కాగా, మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 233 మంది ఇండియా కూటమికి చెందిన ఎంపీలు, మిగిలిన వాటిలో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు.