Share News

National : భార్యాభర్తల నడుమ బుక్కైన యాపిల్‌!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:06 AM

తన నుంచి భార్య విడిపోవడానికి కారణం యాపిల్‌ సంస్థనే అంటూ ఓ వ్యక్తి ఏకంగా కోర్టులో కేసు వేశాడు. ఆ కంపెనీ నుంచి పరిహారంగా రూ.53 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడు. లండన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం త్వరలోనే అక్కడి కోర్టులో విచారణకు రానుంది.

National : భార్యాభర్తల నడుమ బుక్కైన యాపిల్‌!

సెక్స్‌ వర్కర్లతో ఐఫోన్‌లో ఓ వ్యక్తి చాటింగ్‌

మెసేజ్‌లు కంటపడటంతో భార్య విడాకులు

‘డిలీట్‌’పై అవగాహన కల్పించలేదంటూ

యాపిల్‌ సంస్థపై రూ.53 కోట్లకు భర్త దావా

లండన్‌, జూన్‌ 17: తన నుంచి భార్య విడిపోవడానికి కారణం యాపిల్‌ సంస్థనే అంటూ ఓ వ్యక్తి ఏకంగా కోర్టులో కేసు వేశాడు. ఆ కంపెనీ నుంచి పరిహారంగా రూ.53 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడు. లండన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం త్వరలోనే అక్కడి కోర్టులో విచారణకు రానుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లండన్‌కు చెందిన ఓ వ్యాపారి తన యాపిల్‌ ఐఫోన్‌లోని ఐ మెసేజ్‌ ద్వారా సెక్స్‌వర్కర్లతో చాటింగ్‌ చేసేవాడు. అవి తన భార్య కంటపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసేవాడు.

అయితే, తాను వాడుతున్న యాపిల్‌ ఐడీని కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌ లోనూ ఉపయోగించాడు. ఐ మెసేజ్‌లో డిలీట్‌ చేసిన మెసేజ్‌లు ఐమ్యాక్‌లో మాత్రం ఉండిపోయాయి. అవి భార్య కంట పడటంతో ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. చివరకు విడాకులకు అది దారితీసింది. దీంతో సదరు భర్త.. యాపిల్‌ తన వినియోగదారులకు సరైన అవగాహన కల్పించడం లేదని ఆక్షేపిస్తూ కోర్టులో కేసు వేశాడు. ఒక పరికరంలోంచి తీసేసిన సమాచారం, దానితో అనుసంధానించిన ఇతర పరికరాల్లో మాత్రం అలాగే ఉండిపోతుందనే విషయం ముందుగా చెప్పలేదని వాదిస్తున్నాడు. మెసేజ్‌ల్లో పంపినవీ, స్వీకరించినవీ, మరీ ముఖ్యంగా తొలగించినవీ ఏమి అవుతాయనేది తన వినియోగదారులకు స్పష్టపరచకపోవడం యాపిల్‌ పొరపాటేనని అతని తరఫు న్యాయవాది సీమన్‌ వాల్టన్‌ చెబుతున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 07:12 AM