Share News

Rajnath Singh: రాజ్‌నాథ్ నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమవేశం..ఎజెండా ఏమిటంటే..?

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:35 PM

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నేతలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం జరుపనున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది.

Rajnath Singh: రాజ్‌నాథ్ నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమవేశం..ఎజెండా ఏమిటంటే..?

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) నేతలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం జరుపనున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది. ఎన్డీయే భాగస్వాముల మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి కూడా స్పీకర్ పదవిని తిరిగి నిలబెట్టుకోనుందని, డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయే భాగస్వాములకు కేటాయిస్తుందని సమాచారం. రాజ్‌నాథ్ నివాసంలో జరుగనున్న సమావేశంలో జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, రామ్ మోహన్ నాయుడు కింజరపు, లలన్ సింగ్ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.


కాగా, ఎన్డీయే కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, జేడీయూ ఇప్పటికే స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. జూన్ 26న స్పీకర్‌ పదవికి ఎన్నిక ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రెండ్రోజుల తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. మొదటి రెండ్రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2024 | 03:36 PM