CBI: నీట్ పేపర్ లీక్ కేసులో మరో నిందితుడి అరెస్ట్.. సమాధానాలు షేర్ చేసింది అతనే
ABN , Publish Date - Jul 11 , 2024 | 06:30 PM
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
ఢిల్లీ: నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతను నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు.
వివిధ ప్రాంతాల్లో దాడులు..
రాకీని పట్టుకునేందుకు పట్నా, కోల్‌కతా సమీపంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. అతని భార్య ఇమెయిల్ ID ఐపీ అడ్రస్ ద్వారా రాకీని పట్టుకోగలిగారు.అరెస్టు అనంతరం కోర్టులో రాకీని హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం సీబీఐ అతనికి10 రోజుల రిమాండ్‌ను మంజూరు చేసింది. అతను ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
బిహార్ రాష్ట్రం మలందాకు చెందిన మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియాతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఇద్దరు అనుమానితులైన సన్నీ, రంజిత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. సన్నీ విద్యార్థి కాగా, రంజిత్ ఓ విద్యార్థి తండ్రి. వీరిని ఆరు రోజుల రిమాండ్‌కు తరలించారు. వారిని విచారిస్తుండగానే రాకీ గురించి తెలిసింది.
పేపర్ లీక్‌తో ప్రమేయం
హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ నుంచి పేపర్ లీక్ జరిగిందని విచారణలో తేలింది. సంజీవ్ ముఖియా పరీక్ష పత్రాలను అందుకున్నాడు. వాటిని ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చింటూ మొబైల్‌కు ఫార్వార్డ్ చేశాడు. చింటూ, రాకీ.. పట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌లో ప్రశ్నలు, సమాధానాలను విద్యార్థులకు షేర్ చేశారు.
ఇదికూడా చదవండి:
మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest News and National News