Share News

Social Media: చైనాలో ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ చేసిన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న భారతీయులు

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:23 AM

చైనాలో పర్యటిస్తున్న ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్ ఒకరికి సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో కామెడీ పేరుతోనో.. ఫ్రాంక్ పేరుతోనో ఎదుటి వారిని సిల్లీ ప్రశ్నలడగటమో.. లేదంటే ఆట పట్టించడమో జరుగుతోంది.

Social Media: చైనాలో ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ చేసిన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న భారతీయులు

చైనాలో పర్యటిస్తున్న ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్ ఒకరికి సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో కామెడీ పేరుతోనో.. ఫ్రాంక్ పేరుతోనో ఎదుటి వారిని సిల్లీ ప్రశ్నలడగటమో.. లేదంటే ఆట పట్టించడమో జరుగుతోంది. ఇది కాస్తా కొందరికి రివర్స్ అవుతోంది. ఇన్‌ఫ్లూయన్సర్ జస్‌ప్రీత్ కౌర్ విషయంలోనూ అదే జరిగింది. చైనా వీధుల్లో తననేదో గొప్పగా చూపించుకోవాలన్నట్టుగా ఓ వీడియో చేసింది. ఆ వీడియోను చూసిన వారంతా ఆమెను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఒకరకంగా తిట్టి పోస్తున్నారనుకోండి. కామెడీ పేరుతో చైనీయులను ఆమె ఎగతాళి చేసింది. పైగా వారిని పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఆమె ప్రశ్నలు.. ఆమె వ్యవహార శైలి నెటిజన్లకు చిరాకు తెప్పించాయి. అంతే ఒకాట ఆడుకున్నారు.


“జైసే ఆప్ లోగ్ కరోనా దే సక్తే హో వరల్డ్ కో, తో క్యా మే ఆప్కో ట్రామా దే శక్తి హూ? (మీరు ప్రపంచానికి కరోనాను ఎలా అందించారో.. అలాగే నేను మీకు రిటర్న్ గిఫ్ట్‌గా నేను మీకు దెబ్బ కొట్టనా?") అని అడిగింది. అంతటితో ఆగిందా? అక్కడే ఉన్న ఓ ఫుడ్ స్టోర్‌కు వెళ్లి. . ‘ మీరు ఏ జంతు మాంసాన్ని విక్రయిస్తున్నారు?’ అంటూ ఎగతాళిగా అడిగింది. తరువాత ఆమె ఒక వ్యక్తి వద్దకు వెళ్లి, ఒక రహదారిపై నిర్మించిన వంతెన గురించి ఆరా తీసింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... అది చైనీస్ నిర్మిస్తున్న వంతెన కాబట్టి.. దాని నాణ్యతపై తనకు అనుమానం ఉందని సదరు వ్యక్తికి చెప్పింది. అలాగే చైనాలోని ఆమె ఉన్న ప్రాంతంలో కౌర్ అనే మార్కెట్‌కు వెళ్లి ఇద్దరు వ్యక్తులను ఆపింది. వారు ‘గూచి కాపీ’ ధరించి ఉంటారు. వారిని చూసి మీది సరోజినీ నగరా? అని అడిగింది. సరోజినీ నగర్ అనేది ఢిల్లీలోని ఒక ప్రముఖ మార్కెట్.


మార్చిలో దీనిని జెస్‌ప్రీత్ కౌర్ షేర్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకూ దాదాపు 11.5 మిలయన్ల మంది వీక్షించారు. ఇక కామెంట్స్ అయితే వెల్లువెత్తుతున్నాయి. ఒక నెటిజన్ వచ్చేసి ముందుగా ప్రజలను ఎలా గౌరవించాలో తెలుసుకోండి. మన దేశం పరువు తీసేశారంటూూ దుమ్మెత్తి పోశాడు. మరో నెటిజన్ వచ్చేసి ఈ రకమైన కంటెంట్ చూడాల్సి రావడం బాధాకరమని అన్నారు. ఫన్‌కి.. అగౌరవానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుందని.. దానిని మీరు దాటేశారని అన్నారు. మరో నెటిజన్ మీ వీడియో చాలా మూర్ఖంగా ఉందని.. తెలుసుకోండని వ్యాఖ్యానించారు. మరొకరు.. కొంతమంది తమ ప్రవర్తనతో ఇతరులను అవమానించి ఏం సాధించాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది నిజంగా ఫన్ కాదని.. కించపరచడమని మరొక నెటిజన్ పేర్కొన్నారు. మొత్తానికి జెస్ ప్రీత్ ఏదో చేద్దామనుకుని అభాసు పాలైంది.

Updated Date - Jul 29 , 2024 | 09:24 AM