Share News

New Year: కొత్త సంవత్సర వేడుకలు.. లక్షమంది పోలీసులతో భద్రత

ABN , Publish Date - Dec 26 , 2024 | 10:23 AM

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మెరీనా తీరంలో సముద్ర స్నానాలను నిషేధించారు. మెరీనా తీరంలో 25 ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు.

New Year: కొత్త సంవత్సర వేడుకలు.. లక్షమంది పోలీసులతో భద్రత

- మెరీనాలో సముద్ర స్నానాలపై నిషేధం

- 25 ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్‌

చెన్నై: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మెరీనా తీరంలో సముద్ర స్నానాలను నిషేధించారు. మెరీనా తీరంలో 25 ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నగర వాసులు సంబరాలు జరుపుకుంటారు. ఈ వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: ఐదు రోజులు మోస్తరు వర్షాలు..


ఈ నెల 31వ తేదీ రాత్రి నగరంలోని నక్షత్ర హోటళ్ళు, రిసార్టులు, ఫామ్‌ హౌస్‌ల్లో న్యూ ఇయర్‌ వేడుకలకు ఏర్పాట్టు చేస్తున్నారు. అలాంటి చోట్ల గట్టి భద్రత కల్పించనున్నారు. ఒక్క చెన్నై(Chennai) నగరంలోనే 20 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో నిమగ్నంకానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రమాదాలను నివారించేందుకు వాహన రాకపోకలను నియంత్రించనున్నారు. చెన్నై నగరంలో 1500 మంది హోం గార్డుల సహా 18వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు.


ఈ నెల 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ భద్రత ఏర్పాటు చేయనున్నారు. వాహనాల వేగ నియంత్రణ కోసం నగర వ్యాప్తంగా 40కుపైగా ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. పాత మహాబలిపురం రోడ్డు, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు (ఈసీఆర్‌) వంటి రహదారుల్లో బైక్‌, ఆటో రేస్‌లు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు.

nani2.3.jpg


మెరీనా తీరంలోని సర్వీస్‌ రోడ్డును ఈ నెల 31వ తేదీ రాత్రి 7 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి వేయనున్నారు. ఈ సర్వీస్‌ రోడ్డులో వెళ్ళే వాహనాలను లైట్‌ హౌస్‌ జంక్షన్‌ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. చెన్నై నగరంలోని 30కి పైగా వంతెనలను 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ కొత్త సంవత్సర వేడుకలను నగర పోలీసులు ఆనందంతో జరుపుకోవాలని నగర పోలీసులు కోరారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 10:23 AM