New York : గూగుల్‌కు పోటీగా.. ఓపెన్ ఏఐ ‘సెర్చ్ జీపీటీ’
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:53 AM
సెర్చింజన్ అనగానే ప్రపంచంలో 99.9 శాతం మందికి మొదట గుర్తొచ్చే పేరు.. గూగుల్! ఈ విషయంలో గూగుల్‌ది ఏకఛత్రాధిపత్యమే!!
న్యూయార్క్, జూలై 26: సెర్చింజన్ అనగానే ప్రపంచంలో 99.9 శాతం మందికి మొదట గుర్తొచ్చే పేరు.. గూగుల్! ఈ విషయంలో గూగుల్‌ది ఏకఛత్రాధిపత్యమే!! దాని ధాటికి మైక్రోసాఫ్ట్ కూడా తట్టుకోలేకపోయింది. బింగ్, యాహూ, డక్‌డక్‌గో వంటి సెర్చింజన్లు చాలానే ఉన్నా అత్యధికులు వాడేది గూగుల్‌నే.
కానీ.. ఇప్పుడు దానికో సవాల్ ఎదురవుతోంది. చాట్‌జీపీటీ పేరుతో కృత్రిమ మేధను సామాన్యులకూ అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ గూగుల్‌కు పోటీగా అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ సెర్చింజన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దాని పేరు.. సెర్చ్ జీపీటీ. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ సెర్చింజన్.. ఓపెన్ఏఐ ఇప్పటికే రూపొందించిన చాట్‌జీపీటీకి, చాట్‌బాట్‌కు అనుసంధానమై పనిచేస్తుందని సమాచారం.