Share News

నిర్మలకు కర్ణాటక హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:17 AM

ఎలక్టోరల్‌ బాండ్‌లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై తిలక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు

నిర్మలకు కర్ణాటక హైకోర్టులో ఊరట

ఎలక్టోరల్‌ బాండ్‌ల కేసు దర్యాప్తునకు బ్రేక్‌

బెంగళూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎలక్టోరల్‌ బాండ్‌లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై తిలక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నళిన్‌కుమార్‌ కటిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు నిలిపేయాలని న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఎలక్టోరల్‌ బాండ్‌ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలోనే రద్దు చేసిందని, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించేలా కేసు నమోదు చేశారని నళిన్‌ కుమార్‌ కటిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈడీ అధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర నిందితులుగా ఉన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 06:17 AM