Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:15 PM
గత కాంగ్రెస్ పార్టీ పాలనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. సోమవారం రాజ్యాంగపై రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సైతం అగౌరవ పరిచిందని విమర్శించారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అగౌరవ పరిచిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో సంవిధాన్ గౌరవ్ యాత్ర పేరిట చర్చలో భాగంగా భారత రాజ్యాంగంపై మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా గత కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు చెరిగారు. కేవలం కుటుంబ లబ్ది కోసమే రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు.
Also Read: రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్
ముస్లిం మహిళలకు భరణాన్ని సైతం ఇవ్వకుండా చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు రాజకీయ పార్టీల నాయకులు జైళ్లో మగ్గేవారని వివరించారు. అందుకోసం సవరణలు చేసిన మరీ నాయకులను జైల్లో పెట్టిన సందర్భాలున్నాయని ఆరోపించారు. చివరకు ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీ రచించిన పుస్తకంపై నిషేధిం విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆమె పేర్కొన్నారు.
Also Read: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర
ఇక భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయంలో వాక్ స్వాతంత్ర్యం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రసిద్ద కవి, గేయ రచయిత మజ్రుహ్ సుల్తాన్ పూరి, ప్రముఖ నటుడు బల్ రాజ్ సాహ్ని అరెస్ట్ అంశాలను ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా ప్రస్తావించారు.
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
1949లో మిల్ కార్మికులకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రుకు వ్యతిరేకంగా రాసిన కవితను కవి సుల్తాన్ పూరి చదివారన్నారు. దీంతో ఆయన జైలుకు వెళ్లారన్నారని తెలిపారు. క్షమాపణలు చెప్పాలని ఆయనకు సూచించినా.. అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. దీంతో మజ్రుమ్ సుల్తాన్ పూరి జైలుకు వెళ్లారని మంత్రి నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. వీరిద్దరిపైనే కాకుండా.. 1975లో మైఖేల్ ఎడ్వర్డ్స్ రాసిన 'నెహ్రూ' అనే రాజకీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని సైతం నిషేధించారన్నారు.
Also Read: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
ప్రధాని ఇందిరా గాంధీతోపాటు ఆమె కుమారుడిని ప్రశ్నించినందుకే 'కిస్సా కుర్సీ కా' అనే చిత్రాన్ని కూడా నిషేధించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. కేవలం ఒక కుటుంబ ప్రయోజం కోసమే రాజ్యాంగాన్ని మార్చిందంటూ గాంధీలను ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శించారు. 1951లో వాక్ స్వాతంత్ర్యాన్ని నియంత్రించేందుకు నాటి భారత తొలి ప్రధాని నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చారని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. ఇక శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై ఘాటైన విమర్శలు సంధించారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే.. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ రక్తం రుచి చూసిందన్నారు. రాజ్యాంగాన్ని పదేపదే ఛిద్రం చేస్తోందంటూ ఆ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. రాజ్యాంగ దార్శనికతకు అనుగుణంగా భారత్ బలంతోపాటు ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా చేసుకుని.. 2014 నాటి నుంచి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ క్రమంలో ప్రధాని మోదీపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
For National News And Telugu News