Nitin Gadkari: గుట్కా తిని రోడ్డుమీద ఉమ్మేసే వాళ్లను ఇలా కట్టడి చేయొచ్చు... చిట్కా చెప్పిన గడ్కరి
ABN , Publish Date - Oct 02 , 2024 | 02:53 PM
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారంనాడు నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో గడ్కరి పాల్గొన్నారు.
నాగపూర్: గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్, మషాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారంనాడు నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో గడ్కరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బహిరంగ ప్రవేశాల్లో చెత్తాచెదారం పడేసే వాళ్లకు కూడా మంత్రి చురకలు వేశారు.''మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు'' అని నవ్వుతూ చురకలు వేశారు. ఇందుకు చిన్నప్పుడు తానే ఒక ఉదాహరణ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే రేపర్ ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు.
Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..
స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని
గాంధీ జయంతి సందర్భంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాలను బుధవారంనాడు దేశవ్యాప్తంగా చేపట్టారు. ఏటా ప్రభుత్వం, ఇతర సంస్థలు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పండారీ పార్క్‌లోని ఒక పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్ని బ్రూమ్‌స్టిక్‌తో పరిసరాలను శుభ్రపరిచారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.