Share News

Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:02 PM

ప్రధాన మంత్రి రూ.12,1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకిత చేసేందుకు బీహార్ వచ్చారు. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో 18 జన్ ఔషధి కేంద్రాలను కూడా జాతికి ప్రధాని అంకితం చేశారు. ఈ సందర్భంగా దర్బంగాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో నితీష్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు.

Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్

దర్బంగా: లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల బహిరంగ వేదకలపై కూడా తిరుగులేని మద్దతును చాటుకుంటున్నారు. దర్భంగాలో బుధవారంనాడు జరిగిన ర్యాలీలోనూ నితీష్ ఇదే తరహాలో విధేయత చాటుకున్నారు. మోదీ పాదాలకు నితీష్ మొక్కే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే మోదీ ఆయనను వారించారు.

Bulldozer Justice: బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు సీరియస్.. ఏమన్నదంటే..


ప్రధాన మంత్రి రూ.12,1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకిత చేసేందుకు బీహార్ వచ్చారు. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో 18 జన్ ఔషధి కేంద్రాలను కూడా జాతికి ప్రధాని అంకితం చేశారు. ఈ సందర్భంగా దర్బంగాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో నితీష్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. సుపరిపాలన అంటే ఏమిటో నితీష్ చూపించారని, జంగిల్ రాజ్‌గా ఉండే బీహార్‌ను ఇంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన నితీష్‌ను ఎంత అభినందించినా తక్కువేనని అన్నారు. అనంతరం నితీష్ ప్రసంగిస్తూ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న మద్దతుకు గాను ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగం ముగియగానే ఆయన నేరుగా ప్రధాని కూర్చున్న చోటుకు వెళ్లి ఆయన పాదాలకు మెుక్కే ప్రయత్నం చేయడంతో మోదీ వారించారు.


నితీష్ కుమార్ గత జూన్‌లో ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం సమయంలోనూ ప్రధాని మోదీ పాదాలకు మొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని వెంటనే వారించి ఆయనతో కరచాలనం చేశారు.


నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 03:04 PM