MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం
ABN , Publish Date - Aug 19 , 2024 | 05:09 PM
ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్‌చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
బెంగళూరు, ఆగస్ట్ 19: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్‌చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం
ఈ రిట్ పిటిషన్‌పై సింగిల్ బెంచ్ జడ్జి హేమంత్ చందన్‌గౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య తరపు న్యాయవాదీ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. ఆ క్రమంలో ఆగస్ట్ 29వ తేదీ వరకు సీఎం సిద్దరామయ్యను ఎలాంటి విచారణ జరప వద్దని న్యాయమూర్తికి వివరించారు. దీంతో న్యాయవాది సింఘ్వీ వాదనలతో సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందన గౌడ్ ఏకీభవించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకో వద్దని ఆదేశించింది.
Also Read: MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య ప్రమేయం ఉందంటూ.. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహం తదితరులు.. ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రత్యేక కోర్టుకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాత్ ఆగస్ట్ 17వ తేదీన అనుమతి ఇస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలంటూ సిఎం సిద్దరాయమ్య.. సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్‌ను సోమవారం సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందన్ గౌడ్ విచారించారు. సీఎం సిద్దరామయ్యను ఆగస్ట్ 29వ తేదీ వరకు ప్రాసిక్యూషన్ చేయకూడదంటూ సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందన్ గౌడ్ ఆదేశించారు. దీంతో సీఎం సిద్దరామయ్యనకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అయింది.
Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ
For Latest News and National News click here