Political Campaigns: అక్కడ మూగబోయిన ప్రచారం.. కానరాని పెద్ద నేతలు.. కారణం ఇదేనా?
ABN , Publish Date - Apr 10 , 2024 | 01:10 PM
ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.
ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. రాజకీయ పార్టీలు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. దాదాపు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ.. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) జోషిమఠ్ (Joshimath), చమోలి జిల్లాల్లో ఆ హడావుడి కనిపించడం లేదు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం ఆ ప్రాంతాలకు దూరంగా ఉంటున్నారు. అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారాలను నిర్వహిస్తున్నారంతే!
బ్రౌన్ రైస్‌తో బోలెడన్ని లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం
ఇందుకు గల కారణాలేంటని ఆరా తీస్తే.. గతంలో జోషిమఠ్, దసౌలి డెవలప్‌మెంట్ బ్లాకుల్లోని భూమి కుంగిపోవడమేనని తెలుస్తోంది. గతేడాదిలో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. అయితే.. ఆ సమయంలో ఏ ఒక్కరూ సహాయక చర్యలు చేపట్టలేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం దానిపై పెదవి విప్పలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లి ఓట్లు అడిగితే.. ప్రజలు తమని ఆ సంఘటన విషయంలో ఎక్కడ ప్రశ్నిస్తారని నేతలు భయపడుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఈ ఏడాది ఎన్నికల సమయంలో జోషిమఠ్‌లో నిశ్శబ్దం అలుముకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు
ఇదిలావుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) మొత్తం ఏడు దశల్లో ఉండనున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనుండగా.. రెండో దశ ఏప్రిల్ 26, మూడో దశ మే 7, నాలుగో దశ మే 13, ఐదో దశ మే 20, ఆరో దశ మే 25, ఏడో దశ జూన్ 1వ తారీఖున జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. మూడోసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ (BJP) నమ్మకంగా చెప్తుండగా.. బీజేపీని గద్దె దించి, అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ (Congress) ఉద్ఘాటిస్తోంది. మరి.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి