Punjab: అమృత్‌సర్‌లో పట్టపగలు ఎన్నారై ఇంట్లో దారుణం
ABN , Publish Date - Aug 24 , 2024 | 09:09 PM
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి అతడిపై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించింది. అమెరికా నుంచి ఇటీవల అమృత్‌సర్‌కు ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్ వచ్చారు. శనివారం ఉదయం డబుర్జి ప్రాంతంలోని అతడి నివాసంలోని ఇద్దరు ఆగంతకులు చొరబడి.. అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి ముఖానికి, చేతికి గాయాలయ్యాయి.
అమృత్‌సర్, ఆగస్ట్ 24: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి అతడిపై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించింది. అమెరికా నుంచి ఇటీవల అమృత్‌సర్‌కు ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్ వచ్చారు. శనివారం ఉదయం డబుర్జి ప్రాంతంలోని అతడి నివాసంలోని ఇద్దరు ఆగంతకులు చొరబడి.. అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి ముఖానికి, చేతికి గాయాలయ్యాయి.
Also Read: RG Kar college ex-principal: ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు
అతడిని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ టీవీ పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవల రూ. 1.5 కోట్లతో లగ్జరీ కారును ఎన్నారై కొనుగోలు చేశారు. ఆ కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించేందుకంటూ దుండగులు ఎన్నారై నివాసంలోకి వచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక దాడి వెనుక సింగ్ మొదటి భార్య కుటుంబ హస్తం ఉందని అతని తల్లి ఆరోపించింది. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అమృత్‌సర్ పోలీస్ కమిషనర్‌ను ఆమె డిమాండ్ చేసింది. ఆ క్రమంలో అతడి మాజీ భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు: 22 మంది కార్మికులకు గాయాలు
Also Read: Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు
ఇంకోవైపు ఈ కాల్పుల ఘటనపై ప్రతిపక్షం.. శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖబీర్ సింగ్ బాదల్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పంజాబీలు ఎవరూ సురక్షితంగా లేరన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆప్ నేత, సీఎం భగవంత్ సింగ్ మాన్‌ను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నేతలు సైతం స్పందించారు.
Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
Also Read: Jammu Kashmir Assembly Elections: నేషనల్ కాన్ఫరెన్స్‌లో నేతలు తిరుగుబాటు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.