Share News

Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:31 PM

ఇండో-చైనా సరిహద్దుల్లోని వాస్తవ నియంత్ర రేఖ (LAC) వెంబడి గస్తీ ఏర్పాట్లకు సంబంధించి గత అక్టోబర్‌లో న్యూఢిల్లీ-బీజింగ్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత చైనాలో ఢోబాల్ పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్

న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ (Ajit Doval) ప్రత్యేక ప్రతినిధుల చర్యల్లో పాల్గొనేందుకు త్వరలో చైనా (China) వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కీలక దౌత్య సంబంధిత విషయాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సరిహద్దు ఘర్షణల నివారణ, పెట్రోలింగ్, బఫర్ జోన్‌లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇండో-చైనా సరిహద్దుల్లోని వాస్తవ నియంత్ర రేఖ (LAC) వెంబడి గస్తీ ఏర్పాట్లకు సంబంధించి గత అక్టోబర్‌లో న్యూఢిల్లీ-బీజింగ్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత చైనాలో ఢోబాల్ పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి


గాల్వాన్‌ లోయ ప్రతిష్ఠంభన తర్వాత ఇటీవల సరిహద్దు నుంచి భారత్, చైనాలు వెనక్కి తగ్గాయి. ఈ పరిణామానంతరం భారత్-చైనా సంబంధాలపై పార్లమెంటు ఉభయసభల్లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ, చైనా చర్యల వల్ల 2020 నుంచి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లిందని, అప్పట్నించి ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. అయితే ఇటీవల నిరంతర దౌత్య చర్చల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతి కనిపించిందని చెప్పారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆయోదయోగ్యమైన పరిష్కారానికి చైనాతో చర్చలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. జాతీయ భద్రతా ప్రయోజనాలకు భారత్ తొలి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.


కేంద్ర రక్షణ మంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం గత నవంబర్‌లో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌ను లావోస్‌లో కలుసుకున్నారు. సరిహద్దుల్లో ఉద్రికత్తలను నివారించేందుకు ఉభయ దేశాలు పరస్పర విశ్వాసం, నమ్మకంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..

For National News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 03:31 PM