Share News

Ilambazar Health Center: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం

ABN , Publish Date - Sep 01 , 2024 | 02:34 PM

కోల్‌కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నాయి.

Ilambazar Health Center: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం

కోల్‌కతా, సెప్టెంబర్ 01: కోల్‌కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నాయి. అలాంటి వేళ.. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు పట్ల చికిత్స తీసుకుంటున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలోని ఇలంబజార్‌ ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. తీవ్ర జర్వంతో బాధపడుతున్న వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఇలాంబజార్‌ ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు. అతడికి అత్యవసర చికిత్స అందించే క్రమంలో.. సలైన్‌ పెట్టేందుకు నర్సు యత్నించింది. ఆమె పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా ఆమెను తీవ్రంగా దూషించాడు.

Also Read:Maha Vikas Aghadi: నేడు జోడి మారో ర్యాలీ.. స్పందించిన బీజేపీ

Also Read: Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..


చికిత్సకు సహకరించేలా చూడాలంటూ అతడి కుటుంబ సభ్యులకు నర్స్‌ సూచించింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయాన్ని ఆమె ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి నర్స్ స్పందించారు. ఆసుపత్రిలో తమకు భద్రతే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతడు.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ విధంగా వ్యవహరించమే అందుకు కారణమన్నారు.

Also Read:Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ


ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యుడు డాక్టరు మసిదుల్ హసన్ మాట్లాడారు. చోటాచక్ గ్రామానికి చెందిన అబ్బాస్ ఉద్దీన్ తీవ్ర జర్వంతో ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు. చికిత్స అందించే క్రమంలో నర్స్‌ పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. దీంతో ఇలంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిని వారు అరెస్ట్ చేశారని చెప్పారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 01 , 2024 | 03:04 PM