Bangalore: ఓ మై డాగ్.. క్లూస్ టీం డాగ్ సిరి మృతితో పోలీసుల ఆవేదన
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:02 PM
పలు కేసులను చేధించి, పోలీసులకు అండగా నిలచిన పోలీస్ జాగిలానికి అరుదైన గౌరవం దక్కింది. మృతి చెందిన పోలీస్ జాగిలాన్ని తలుచుకుని పోలీసులు తీవ్ర వేదనకు గురయ్యారు. జిల్లా పోలీస్ శాఖలో 8 ఏళ్లుగా క్లూస్ టీం(Clues Team)లో సేవలందించిన సిరి అనే పేరున్న డాబర్మాన్ జాతి జాగిలం మృతి చెందగా దానికి సోమవారం అధికారులు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రాయచూరు(బెంగళూరు): పలు కేసులను చేధించి, పోలీసులకు అండగా నిలచిన పోలీస్ జాగిలానికి అరుదైన గౌరవం దక్కింది. మృతి చెందిన పోలీస్ జాగిలాన్ని తలుచుకుని పోలీసులు తీవ్ర వేదనకు గురయ్యారు. జిల్లా పోలీస్ శాఖలో 8 ఏళ్లుగా క్లూస్ టీం(Clues Team)లో సేవలందించిన సిరి అనే పేరున్న డాబర్మాన్ జాతి జాగిలం మృతి చెందగా దానికి సోమవారం అధికారులు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం వద్ద అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియల్లో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Murder: ఆలిపై అరాచకం.. భార్యను హత్య చేసి ముక్కలుగా కోసి..
ఈ సందర్భంగా ఎస్పీ పట్టమాదయ్య(SP Pattamaiah) మాట్లాడుతూ 8 ఏళ్లుగా పోలీసులకు నేర పరిశోధనలో ఎంతో సహకరించిన జాగిలం మృతి చెందడం బాధాకరమన్నారు. పలు కేసులను చేధించడంలో ఈ జాగిలం చూపిన నైపుణ్యం మరువలేనిదన్నారు. ముఖ్యంగా 2022లో మాన్వి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్ట్ ఆఫీసులో జరిగిన దొంగతనాన్ని చేధించడంలో ఈ జాగిలం చేసిన సాయం ఘనమైనదన్నారు. దాంతో పాటే అనేక కేసుల్లో కేసులను పరిష్కరించడంలోనే నేరస్థులను గుర్తించడంలోను శునకం తనదైన నైపుణ్యాన్ని చాటిందన్నారు.
2016లో జన్మంచిన ఈ శునకం 2017లో పోలీస్ క్లూస్ టీంలో చేరి బెంగళూరు(Bangalore)లోని సీఏఆర్ సౌత్ పోలీస్ స్టేషన్‌లో జయకుమార్, శరణ బసవల నేతృత్వంలో శిక్షణ పొందినట్లు ఆయన వివరించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, సమీప పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఎస్పీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News