Akhilesh Yadav: బీజేపీ అదే పాత ట్రిక్.. ఉప ఎన్నికల తేదీ మార్పుపై అఖిలేష్
ABN , Publish Date - Nov 04 , 2024 | 09:29 PM
ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగిత కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారంతా దీపావళి, ఛాహత్ హాలిడేల కారణంగా తిరిగొచ్చారని అఖిలేష్ యాదవ్ చెప్పారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని, ఆ వాస్తవాన్ని గ్రహించిన వెంటనే ఉప ఎన్నికల వాయిదాను బీజేపీ కోరిందని అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తేదీని నవంబర్ 13 నుంచి 20వ తేదీకి మారుస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఘాటుగా స్పందించారు. ఇది బీజేపీ 'ఓల్డ్ ట్రిక్' అని అన్నారు. ఓటమిని తప్పించుకునేందుకు కమలనాథుల ఎత్తుగడ అని ఆరోపించారు.
India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్
''మొదటి మల్కిపురి ఉపఎన్నిక వాయిదా వేశారు. ఇప్పుడు తక్కిన అన్ని స్థానాల్లో ఉప ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేశారు. బీజేపీ ఎప్పుడూ ఇంత బలహీనంగా లేదు'' అని అఖిలేష్ సామాజిక మాధ్యమం "ఎక్స్''లో పోస్ట్ చేశారు. ఎన్నికల తేదీని పోస్ట్ పోన్‌కు వెళ్లినప్పటికీ వారి (బీజేపీ) పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందన్నారు.
అఖిలేష్ యాదవ్ దీనిపై మరింత వివరణ ఇస్తూ, ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగిత కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారంతా దీపావళి, ఛాహత్ హాలిడేల కారణంగా తిరిగొచ్చారని చెప్పారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని, ఆ వాస్తవాన్ని గ్రహించిన వెంటనే ఉప ఎన్నికల వాయిదాను బీజేపీ కోరిందని అన్నారు. పండగలు కోసం వచ్చిన వారంతా హాలీడేలు పూర్తికాగానే ఓటు వేయకుండానే వెళ్లిపోతారని గ్రహించిన బీజేపీ పోలింగ్ తేదీ వాయిదాకు వెళ్లిందని చెప్పారు.
బీజేపీ కౌంటర్
కాగా, అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టివేసింది. హిందువుల పండుగ రోజునే ఎన్నికల తేదీ వచ్చిందని, అది పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీని ఈసీ రీషెడ్యూల్ చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనీష్ శుక్లా తెలిపారు. ప్రతీదీ రాజకీయం చేయడం సమాజ్‌వాదీ పార్టీ అలవాటని, మెజారిటీ ప్రజల సెంటిమెంట్ల కంటే ఓటు బ్యాంకే ఆ పార్టీకి ముఖ్యమని అన్నారు.
ఇది కూడా చదవండి..
Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..