Share News

Om Prakash Chautala: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:05 PM

గురుగావ్ నివాసంలో గుండెపోటు రావడంతో ఓం ప్రకాష్ చౌతాలాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ తుదశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

Om Prakash Chautala: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

న్యూఢిల్లీ: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (Om Prakash Chautala) శుక్రవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గురుగావ్ నివాసంలో గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ తుదశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్


హర్యానా రాజకీయాల్లో దిగ్గజనేతగా పేరున్న చౌతాలా 1989 నుంచి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చివరిసారిగా 1999 నుంచి 2005 వరకూ సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా హర్యానాకు చిరకాల సేవలందించిన నేతగా కూడా నిలిచారు. 1935 జనవరిలో ఓం ప్రకాష్ చౌతాలా జన్మించారు. హర్యానాకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, దేశ ఆరవ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవీలాల్‌ తనయుడే ఓం ప్రకాష్ చౌతాలా. తన తండ్రి అడుగుజాడల్లోనే ఓం ప్రకాష్ చౌతాలా సైతం ప్రముఖ నేతగా రాజకీయాల్లో ఎదిగారు. చౌతాలా తన హయాంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1987లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 1990 వరకూ సేవలందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) అసోసియేషన్‌తో తన రాజకీయ సత్తాను చాటుకున్నారు. కాగా, వివాదాలు, లీగల్ చిక్కులు కూడా ఆయన చవిచూశారు. 1999-2000లో హర్యానాలో జూనియర్ ప్రైవరీ టీచర్ల నియామకాలకు సంబంధించి చిక్కుల్లో పడ్డారు. టీచర్స్ రిక్రూట్‌మెట్ స్కామ్‌లో పదేళ్లు జైలుశిక్ష పడింది. 2021 జూలైలో తొమ్మిదన్నరేళ్ల శిక్ష అనంతరం 2021 జూలైలో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. చౌతాలా న్యాయపరమైన వివాదాలు చవిచూన్నప్పటికీ హర్యానా రాజకీయాల్లో ఆయన చూపిన నాయకత్వ పటిమి ప్రత్యేకత సంతరించుకుంది.


ప్రముఖుల సంతాపం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా మృతికి పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. చౌతాలా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఏళ్లు చురుకుగా పనిచేశారని, చౌదరి దేవీలాల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంతాప సందేశంలో గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చౌతాలా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా తదితరులు కూడా సంతాపం తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు

Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 20 , 2024 | 04:07 PM