Share News

Kolkata Blast: కోల్‌కతాలో పేలుడు కలకలం.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

ABN , Publish Date - Sep 14 , 2024 | 08:09 PM

బ్లాచ్మాన్ వీధి ప్రవేశమార్గం వద్ద ఒక ప్లాస్టిక్ గోనెసంచీని కనుగొన్నట్టు స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసర్ తెలిపారు. నిరసనలతో అట్టుడికిన ఆర్జే కర్ మెడికల్ ఆసుపత్రి వద్ద ఎవరికీ చెందని బ్యాగు ఒకటి కలకలం సృష్టించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.

Kolkata Blast: కోల్‌కతాలో పేలుడు కలకలం.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

కోల్‌కతా: సెంట్రల్ కోల్‌కతాలోని శనివారంనాడు జరిగిన పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ పేలుడుతో ఫుట్‌పాత్‌పై జీవనం సాగించే 58 ఏళ్ల బపిదాస్ అనే రాగ్‌పికర్ గాయపడ్డాడు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ఈ పేలుడు జరగడంతో తల్టాల పోలీస్ స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఎన్ఆర్ఎస్ ఆసుపత్రికి తరలించినట్టు స్టేషన్ ఆఫీస్ ఇన్‌చార్జి తెలిపారు. బ్లాచ్మాన్ వీధి ప్రవేశమార్గం వద్ద ఒక ప్లాస్టిక్ గోనెసంచీని కనుగొన్నట్టు చెప్పారు. నిరసనలతో అట్టుడికిన ఆర్జే కర్ మెడికల్ ఆసుపత్రి వద్ద ఎవరికీ చెందని బ్యాగు ఒకటి కలకలం సృష్టించిన మరుసటి రోజే సెంట్రల్ కోల్‌కతాలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Kolkata: వైద్యులపై దాడికి కుట్ర.. ఆడియో క్లిప్‌ విడుదల చేసిన టీఎంసీ


ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ హోం మంత్రికి లేఖ

కాగా, సెంట్రల్ కోల్‌కతాలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై ఎన్ఐఏతో కానీ ఇతర సెంట్రల్ ఏజెన్సీలతో కానీ దర్యాప్తు జరిపించాలని పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్ సుకాంత మజుందార్ కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. పేలుడుకు కారణంపై విచారణ జరిపేందుకు స్థానిక పోలీసుల పరిధి పరిమితంగా ఉంటుందని, ఘటన తీవ్రత, ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.


Read MoreNational News and Latest Telugu News

Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..

Updated Date - Sep 14 , 2024 | 08:11 PM