One Nation One Election Bills: జమిలి బిల్లులకు అనుకూలంగా 269 ఓట్లు
ABN , Publish Date - Dec 17 , 2024 | 02:50 PM
జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టేందుకు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చాయి. ఇందుకోసం ప్రతిపాదించిన రాజ్యాంగ (128 సవరణ) బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాతాల చట్టాల (సవరణ) బిల్లు-2024ను కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. బిల్లులకు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటు వేయగా, 198 మంది ఎంపీలు బిల్లులను వ్యతిరేకించారు. నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.
బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు అధికార ఎంపీలు, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లులను వ్యతిరేకించారు. ఏకకాలంలో ఎన్నికలు ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి పేర్కొన్నారు. బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరారు. దేశంలో నియంతృత్యానికి బీజేపీ జరుపుతున్న ప్రయత్నంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అభివర్ణించారు. రాజ్యాంగ పరరక్షణకు చర్చజరిగి రెండ్రోజులు కూడా కాకుండానే రాజ్యాంగ సవరణ బిల్లును తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి చరమగీతం పాడాలనుకోవడం సరికాదన్నారు. బిల్లులను నిర్ద్వంద్వంగా తమ పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలను సంస్కరించేందుకు కాకుండా ఒక జెంటిల్‌మన్ కోరిక, కలను సాకారం చేసేందుకు ఈ బిల్లులను తెచ్చారని టీపీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తప్పుపట్టారు.
జమిలి కొత్తదేమీ కాదు: మేఘవాల్
జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తదేమీ కాదని, 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు జరపాలనే డిమాండ్ ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక సర్వరూపానికి కానీ రాష్ట్రాల హక్కులకు కానీ, సమాఖ్య స్ఫర్తికి కానీ భంగం కాదన్నారు. స్వీడన్, జర్మనీలోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు.
Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..
Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్
For National News And Telugu News