Share News

One nation, One Election: జమిలి ఎన్నికలపై వేలాది సూచనలు.. అందులో అత్యధికం..

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:22 PM

జమిలి ఎన్నికల బిల్లు సభలో ప్రవేపెట్టక ముందు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్యానెల్ కు దేశవ్యాప్తంగా ప్రజలు నుంచి దాదాపు 21 వేల సూచనలు అందాయి. వారిలో 81 శాతం మంది ప్రజలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా స్పందించారు.

One nation, One Election: జమిలి ఎన్నికలపై వేలాది సూచనలు.. అందులో అత్యధికం..

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి ఎన్నికల బిల్లు లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఇండియా కూటమిలోని ప్రధాన కాంగ్రెస్ పార్టీతోపాటు దాని భాగస్వామ్య పక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికల బిల్లు సభలో ప్రవేపెట్టక ముందు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్యానెల్ కు దేశవ్యాప్తంగా ప్రజలు నుంచి దాదాపు 21 వేల సూచనలు అందాయి. వారిలో 81 శాతం మంది ప్రజలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా స్పందించారంటూ పీటీఐ వార్త సంస్థ ఈ ఏడాది జనవరిలోనే వెల్లడించింది.

Also Read: మార్పునకు సీఎం చంద్రబాబు ముందుంటారు

Also Read: జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్


1)

ఈ రాజ్యాంగ (129వ సవరణ) జమిలి సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీ కావడంతో.. ఈ జేపీసీకి బీజేపీ ఎంపీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో సభ్యులుగా అత్యధికంగా బీజేపీ సభ్యులే ఉండనున్నారు. ఈ కమిటీ పదవి కాలం 90 రోజులు ఉంటుంది. దీనిని పొడిగించే అవకాశముంది.

Also Read: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?

2)

ఈ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి లేకుంటే జేపీసీకి పంపాలని డిమాండ్ చేశారు.

Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం


3)

ఈ బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలని ఎంపీ తివారీ డిమాండ్ చేశారు. ఇది నియంతృత్వానికి మార్గమని ఎంపీ యాదవ్ అభివర్ణించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని ఎంపీ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: సభలో ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లు

4)

ఇక బీజేపీ మిత్ర పక్షాలు.. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, మహారాష్ట్రలోని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ సైతం ఈ బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం.

5)

దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు మంగళవారం ఉదయం లోక్ సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర


6)

ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టే ముందు మంగళశారం లోక్ సభలో అధికార బీజేపీ, కాంగ్రస్ పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపక్షలు సహేతుకమైన వాదన చేయడం లేదన్నారు. ఇక ప్రతిపక్షం అయితే ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఉద్దేశించబడిందని వ్యాఖ్యానించింది.

Also Read: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు

7)

ఒకే దేశం, ఒక ఎన్నిక ప్రతిపాదనను అమలు చేయడానికి సంబంధించిన రెండు సవరణల బిల్లులను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

For National News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 03:22 PM