Ooty Hill Train: ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభం
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:50 AM
మేట్టుపాళయం-ఊటీ(Mettupalayam-Ooty) మధ్య కొండ రైలు సేవలు ఐదు రోజుల అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ మధ్య కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
చెన్నై: మేట్టుపాళయం-ఊటీ(Mettupalayam-Ooty) మధ్య కొండ రైలు సేవలు ఐదు రోజుల అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ మధ్య కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతాల్లో మట్టిచెరియలు కొండ రైలు మార్గంపై పడుతుండడంతో ఈ రైలు సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 13 నుంచి 17వ తేది వరకు నీలగిరి(Neelagiri) జిల్లాకు భారీ వర్షసూచన ప్రకటించారు. దీంతో, ముందస్తు చర్యల కింద కొండ రైలు సేవలు ఐదు రోజులు రద్దు చేశారు. ఐదు రోజుల అనంతరం బుధవారం ఉదయం 7.10 గంటలకు మేట్టుపాళయం నుంచి ఊటీకి కొండ రైలు బయల్దేరడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ‘108’ అంబులెన్స్ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్’ లింక్
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News