Share News

Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు

ABN , Publish Date - Aug 09 , 2024 | 10:32 AM

రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని భారతీయ రాయబార కార్యాలయాల సిబ్బంది.. భారతీయులను స్వచ్ఛందంగా స్వదేశానికి పంపుతున్నారని చెప్పారు.

Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 09: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి దాదాపు 7,200 మందికిపైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు వీరంతా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకున్నారని వివరించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?


రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని భారతీయ రాయబార కార్యాలయాల సిబ్బంది.. భారతీయులను స్వచ్ఛందంగా స్వదేశానికి పంపుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని భారతీయులు.. స్వదేశానికి వచ్చే క్రమంలో ఎయిర్ పోర్టుల్లో, అలాగే భారత్ సరిహద్దు చేరే వరకు వారికి భద్రత కల్పించే విధంగా ఆ దేశ ఉన్నతాధికారులతో కలిసి రాయబార కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారని వివరించారు.

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం ఆ దేశ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఉద్యమం ఎగసిపడింది. భారీగా హింస చోటు చేసుకోవడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. దీంతో ప్రభుత్వం రద్దు అయింది. పాలన సైనికుల చేతిలోకి వెళ్లింది.

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు


దీంతో విద్యార్థి సంఘాలతో బంగ్లాదేశ్ చర్చలు జరిపింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతులు ప్రొ. యూనుస్‌కు అప్పగించాలని బంగ్లాదేశ్ దేశాధ్యక్షుడుకి విద్యార్థి సంఘాల నేతలు విజ్జప్తి చేశారు. దాంతో ప్రొ. యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం గురువారం రాత్రి ఏర్పాటు అయింది. మరోవైపు ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో తలదాచుకున్న హసీనాకు లండన్ వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె ప్రస్తుతం భారత్‌లోనే తలదాచుకున్నారు. ఆమె యూరప్‌కు వెళ్లేలా... భారత్ తనదైన శైలిలో వ్యూహారచన చేస్తున్నట్లు సమాచారం.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 10:49 AM