Share News

National: రాహుల్‌, కేజ్రీలకు పాక్‌ మద్దతుపై దర్యాప్తు జరగాలి: మోదీ

ABN , Publish Date - May 28 , 2024 | 05:28 AM

‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

National: రాహుల్‌, కేజ్రీలకు పాక్‌ మద్దతుపై   దర్యాప్తు జరగాలి: మోదీ

న్యూఢిల్లీ, మే 27: ‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఆర్టికల్‌ 370 రద్దు వంటి పలు సందర్భాల్లో రాహుల్‌, కేజ్రీవాల్‌కు పాకిస్థాన్‌ ఎందుకు మద్దతు పలికిందని ప్రశ్నించారు. రాహుల్‌, కేజ్రీవాల్‌లను పొగుడుతూ పాకిస్థాన్‌ మాజీ మంత్రి చౌధరీ ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఐఏఎన్‌ఎ్‌స వార్తా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ దీనిపై స్పందిస్తూ.. భారతీయ ఓటర్లకు చాలా పరిణతి ఉందని, సరిహద్దు ఆవలి వారు చెప్పే మాటలను వారు వినబోరని అన్నారు. ‘‘కొంతమంది అవినీతిపరులను గొప్పవాళ్లుగా కీర్తిస్తున్నారు.

అవినీతిపరులకు మద్దతు పలకడం, వాళ్లు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు సంబరాలు చేసుకోవడం ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. సోనియాజీని జైలుకు పంపాలని ఒకప్పుడు కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడడం లేదు!?’’ అని మోదీ నిలదీశారు.

Updated Date - May 28 , 2024 | 05:28 AM