Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు
ABN , Publish Date - Oct 28 , 2024 | 02:46 PM
రెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. తనకు 'జడ్' కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగానే ఈ భద్రతను కోరుతున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
పాట్నా: పూర్ణియా లోక్‌సభ ఎంపీ పప్పూ యాదవ్ (Pappu Yadav)కు నిషేధిత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) నుంచి చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై ఆయన డీజీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టం అనుమతిస్తే 24 గంటల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌ను లేకుండా చేస్తానని పప్పూ యాదవ్ ఇటీవల సామాజిక మాధ్యమం "ఎక్స్''లో ట్వీట్ చేశారు. ముంబైలో ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖి హత్యానంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు తాజాగా బెదిరింపులు వచ్చాయి. యాదవ్ కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండకపోతే ఆయనను కూడా చంపేస్తామని కాలర్ హెచ్చరించాడు.
Digital Arrests: బాబోయ్ అన్ని కోట్లా... డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్
''ఒక క్రిమినల్ జైలులో కూర్చుని సవాళ్లు విసురుతున్నాడు. జనాలను చంపుతుంటే ప్రతి ఒక్కరూ మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మొదట మూసేవాలా, ఆ తర్వాత కర్ణి సేన చీఫ్, ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ పొల్టీషియన్. చట్టం కనుక అనుమతిస్తే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను నేను తుదముట్టిస్తాను'' అని పప్పూ యాదవ్ ఇంతకుముందు ట్వీట్ చేశారు.
భద్రత పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. తనకు 'జడ్' కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగానే ఈ భద్రతను కోరుతున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతిని బీహార్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పోలీసు అధికారులకు కూడా పంపారు.
ఇవి కూడా చదవండి
టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య సీట్ల చిచ్చు!
Read More National News and Latest Telugu News