Parliament session 2024 LIVE: దద్దరిల్లిన పార్లమెంట్.. జమిలి ఎన్నికలపై హాట్ డిస్కషన్..
ABN , First Publish Date - Dec 17 , 2024 | 01:02 PM
Parliament session 2024 Live Updates: కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లపై సభలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
Live News & Update
-
2024-12-17T13:38:04+05:30
జమిలి బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు
రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధం: కళ్యాణ్ బెనర్జీ, టీఎంసీ ఎంపీ
రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గడువును పార్లమెంట్ నిర్దేశించడం రాజ్యాంగ విరుద్ధం.
ఆర్టికల్ 82 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి విస్తృత అధికారం కల్పిస్తున్నారు.
ఇది ఎన్నికల సంస్కరణ ఎంతమాత్రం కాదు.
ఇది కేవలం ఒక పెద్దమనిషి కోరికను నిజం చేయడం తప్ప మరేదీ కాదు.
-
2024-12-17T13:35:26+05:30
కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై ఓటింగ్
అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు
సాధారణ మెజార్టీతో బిల్లుకు అనుమతి
-
2024-12-17T13:31:22+05:30
జమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో ఓటింగ్
అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు
-
2024-12-17T13:27:45+05:30
జమిలి బిల్లును జేపీసీకి పంపడానికి మేఘ్‌వాల్ ప్రతిపాదన
జేపీసీకి పంపడంపై లోక్‌సభలో డివిజన్ కోరిన విపక్షాలు
ఓటింగ్‌కు అనుమతి ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా
కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై ఓటింగ్
-
2024-12-17T13:26:15+05:30
జమిలి బిల్లును తదుపరి చర్చకు తీసుకోవడంపై లోక్‌సభలో ఓటింగ్
కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి జరుగుతున్న ఓటింగ్
లోక్‌సభలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్న ఓటింగ్
ఓటింగ్ విధానంపై సభ్యులకు వివరించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్
-
2024-12-17T13:21:12+05:30
ఢిల్లీ: జమిలి బిల్లును జేపీసీకి పంపితే సమగ్ర చర్చ జరుగుతుంది: ఓం బిర్లా
అనంతరం బిల్లుపై పార్లమెంట్‌లో మళ్ళీ సమగ్ర చర్చ జరుగుతుంది: స్పీకర్
-
2024-12-17T13:20:01+05:30
బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది: అమిత్‌షా
ప్రధాని మోదీ స్వయంగా కేబినెట్ భేటీలో చెప్పారు: అమిత్‌షా
బిల్లును జేపీసీకి పంపినప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది: స్పీకర్
-
2024-12-17T13:19:45+05:30
సమాఖ్య స్ఫూర్తికి జమిలి బిల్లు విరుద్ధం కాదు: అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు: అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు: మేఘ్‌వాల్
పార్లమెంట్, అసెంబ్లీల కాలపరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం..
పార్లమెంట్‌కు రాజ్యాంగం ద్వారా కల్పించింది: అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
-
2024-12-17T13:18:46+05:30
జమిలి బిల్లును జేపీసీకి పంపడానికి మేఘ్‌వాల్ ప్రతిపాదన
జేపీసీకి పంపడంపై లోక్‌సభలో డివిజన్ కోరిన విపక్షాలు
డివిజన్‌కు అనుమతి ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా
-
2024-12-17T13:18:00+05:30
జమిలి బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది: ఎంపీ గౌరవ్ గొగోయ్
ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి కొనసాగించాల్సిందే
జమిలి బిల్లును జేపీసీకి పంపాలి: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
జమిలి బిల్లును వ్యతిరేకించిన ఎన్సీపీ ఎస్పీ
రాజ్యాంగానికి వ్యతిరేకంగా జమిలి బిల్లు ఉంది: సుప్రియా
-
2024-12-17T13:17:14+05:30
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం
జమిలి బిల్లు మౌలిక స్వరూపానికి వ్యతిరేకం: అసదుద్దీన్
జమిలి ఎన్నికలు అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తాయి
జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి: అసదుద్దీన్
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ముస్లిం లీగ్
జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగంపై దాడి: ముస్లిం లీగ్
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన సీపీఎం
-
2024-12-17T13:16:58+05:30
జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ
బిల్లును స్వాగతిస్తున్నామన్న పెమ్మసాని చంద్రశేఖర్
మార్పు కోసం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు
జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గుతుంది: పెమ్మసాని చంద్రశేఖర్
జమిలి ఎన్నికల నిర్వహణతో 7శాతం ఓటింగ్ పెరుగుతుంది
ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీల ఖర్చు తగ్గుతుంది: పెమ్మసాని
-
2024-12-17T13:16:43+05:30
జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే: టీఎంసీ
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది: టీఎంసీ
ప్రస్తుతం కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు
ఇది ఎన్నికల సంస్కరణ కాదు.. ఒక వ్యక్తి కల: టీఎంసీ
మెజార్టీ లేనప్పుడు జమిలి బిల్లును ఎలా ప్రవేశపెడతారు?: డీఎంకే
బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి: డీఎంకే
-
2024-12-17T13:16:23+05:30
రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తోంది: మనీష్ తివారీ
జమిలి బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి: మనీష్ తివారీ
రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధి కుదించడానికి వీల్లేదు: మనీష్
రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారు: ఎస్పీ నేత ధర్మేంద్ర
జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తాయి: ధర్మేంద్ర యాదవ్
-
2024-12-17T13:07:18+05:30
ఆ అధికారం రాజ్యాంగం కల్పించింది: కేంద్రమంత్రి
ఢిల్లీ: పార్లమెంట్, అసెంబ్లీల కాలపరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంట్‌కి రాజ్యాంగం ద్వారా కల్పించబడింది: అర్జున్ రామ్ మేఘావల్, న్యాయ శాఖ మంత్రి
-
2024-12-17T13:02:21+05:30
One Nation- One Election Bill: లోక్‌సభ ముందుకు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు.
బిల్లును ప్రవేశపెట్టిన అర్జున్‌రామ్ మేఘ్‌వాల్.
జమిలి బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి.
బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతు.
ఎన్డీఏకు 293 మంది, ఇండి కూటమికి 235 మంది ఎంపీల బలం.
129వ రాజ్యాంగ సవరణ ద్వారా జమిలి బిల్లు: మేఘ్‌వాల్