Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!
ABN , Publish Date - Jun 10 , 2024 | 03:32 PM
మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18,19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 10: మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18,19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం ప్రోటెం స్పీకర్‌ను రాష్ట్రపతి ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. అ వెంటనే స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశాలు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాలు అతి కొద్ది రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
Also Read: Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
మరోవైపు ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానిగా మోదీతోపాటు ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. మొత్తం 72 మందితో మోదీ కేబినెట్ కొలువు తీరింది. వారిలో 30 మంది కేబినెట్ మంత్రులుగా, అయిదుగురు సహాయ మంత్రులు ఇండిపెండెంట్ చార్జ్స్, మరో 36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు
ఇక మోదీ కేబినెట్‌లోని పాత మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జై శంకర్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 స్థానాలు దక్కించుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాలి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ), జేడీ(ఎస్), శివసేన (శిండే వర్గం), లోక్ జనశక్తి (రాం విలాస్ పాశ్వాన్) పార్టీలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సహయం తీసుకుంది. దీంతో మోదీ కేబినెట్‌లో ఆ యా పార్టీలు చోటు సంపాదించాయి.
Read More National News and Latest Telugu News