పాక్‌కు ఐఎంఎఫ్ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:42 AM
పాకిస్థాన్ కనుక భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)ని కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.
గురేజ్, సెప్టెంబర్ 29: పాకిస్థాన్ కనుక భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)ని కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లా గురేజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందన్నారు.