Noida: రూ.2,500తో ఫోన్ డేటా కొనుగోలు.. వివరాలతో కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
ABN , Publish Date - Jul 07 , 2024 | 05:51 PM
నోయిడాకు చెందిన ఓ ముఠా రూ.2,500తో వ్యక్తుల ఫోన్ డేటా కొనుగోలు చేసి దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల ఘరానా మోసానికి దిగింది. ఆదివారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నోయిడాలోని ఫేక్ కాల్ సెంటర్‌ను వేల కోట్ల రుణాల కుంభకోణంలో వందలాది మందిని మోసం చేయడానికి ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
నోయిడా: నోయిడాకు చెందిన ఓ ముఠా రూ.2,500తో వ్యక్తుల ఫోన్ వివరాలు కొనుగోలు చేసి దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల ఘరానా మోసానికి దిగింది. ఆదివారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నోయిడాలోని ఫేక్ కాల్ సెంటర్‌ను వేల కోట్ల రుణాల కుంభకోణంలో వందలాది మందిని మోసం చేయడానికి ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
ఫేక్ బీమా పాలసీలు, లోన్స్ అమ్మిన తొమ్మిది మంది మహిళలు సహా 11 మందిని అరెస్టు చేశారు. ఇద్దరు మాజీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్లు ఆధ్వర్యంలో నోయిడాలోని సెక్టార్ 51లో కాల్ సెంటర్‌ని ఒక సంవత్సరం నడిపారు. రుణాలు, బీమా పాలసీలపై అధిక రాబడిని ఇస్తామని నమ్మించారు. అలా దేశవ్యాప్తంగా చాలా మందిని ఈ ఉచ్చులోకి దింపి మోసం చేశారు. ఈ ముఠా సూత్రధారులైన ఆశిష్, జితేంద్రలు 9 మంది మహిళలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకున్నారు.
వారు పాలసీలను విక్రయిస్తారు. అనుమానం రాకుండా వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేసేవారు. ఇందుకోసం ఫేక్ ఆధార్ కార్డులు ఉపయోగించి సిమ్‌లు కొనుగోలు చేశారు. వీరి సంస్థ కమీషన్ ఆధారంగా పని చేసేది. ఎంత మంది వ్యక్తులకు పాలసీలు చేయిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుందని ఎర చూపేవారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డును అద్దెకు తీసుకుని ఛీటింగ్‌కి పాల్పడ్డారు. ఇలా సమకూరిన నగదును కాజేయటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డును వాడారు. కర్ణాటకలో నివసిస్తున్న వ్యక్తి పేరుతో రూ.10 వేలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా వచ్చిన డబ్బు అరవింద్ పేరుతో ఉన్న పీఎన్బీ డెబిట్ కార్డులోకి వెళ్లేది.
స్కామ్ బాధితుల నుంచి వచ్చిన డబ్బు ఆశిష్ కుమార్, జితేంద్ర తీసుకోవడానికి డెబిట్ కార్డులను ఉపయోగించేవారు. పోలీసుల విచారణలో ఆశిష్ ఉపయోగించిన బ్లాక్ డైరీ దొరికింది. అరెస్టయిన వారిలో కీలక నిందితులు ఆశిష్ కుమార్ అలియాస్ అమిత్, జితేంద్ర వర్మ అలియాస్ అభిషేక్ ఉన్నారు.
కాల్ సెంటర్‌లో పని చేస్తున్న మహిళల్లో నస్నేహ, దివ్య, సూర్తి, సుమన్, మహి, సోనియా, శ్వేత, పూజ, అనన్య ఉన్నారు. వీరంతా తమ పేర్లు మార్చుకుని కస్టమర్లతో ఫోన్లో మాట్లాడేవారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని నోయిడా పోలీసులు కస్టడీకి పంపారు.