అదుపు తప్పిన ఇండిగో విమానం
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:33 AM
ఫెంగల్ తుఫాను వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించి అదుపు తప్పింది.
తుఫానులో ల్యాండింగ్ ప్రయత్నం
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చెన్నై, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాను వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించి అదుపు తప్పింది. అయితే, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం చైన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానానికి ఎదురైన పరిస్థితి ఇది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘విమానం రన్‌వేపై దిగేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది. దాని చక్రాలు నేలకు అంగుళాల దూరంలో ఉండగా విమానం కుదుపులకు లోనవడంతో పైలట్ ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వెంటనే విమానం తిరిగి గాల్లోకి లేచింది.