Share News

NEET Paper Leakage Protests: మా చివరి ఆశ మీరే.. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో విద్యార్థుల భారీ నిరసన

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:50 PM

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌(NEET Paper Leakage) వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మెడికల్‌ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు(Protesters) జంతర్ మంతర్ నుండి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ తీశారు.

NEET Paper Leakage Protests: మా చివరి ఆశ మీరే.. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో విద్యార్థుల భారీ నిరసన

ఢిల్లీ: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌(NEET Paper Leakage) వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మెడికల్‌ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు(Protesters) జంతర్ మంతర్ నుండి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ తీశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ప్రధానిని కలవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించి, ప్రధానికి లేఖ రాయాలని నిరసనకారులకు సూచించారు. అనంతరం ఆందోళనకారులు పోలీసులకు సదరు లేఖను అందజేసి నిరసనను విరమించారు. బిహార్ పోలీసులు పేపర్ లీకేజ్‌ని బయట పెట్టారని, అందువల్ల కౌన్సెలింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు లేఖలో నొక్కి చెప్పారు. ‘దయచేసి న్యాయం చేయండి, మా చివరి ఆశ మీరే’ అని విద్యార్థులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. మే 5 న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది, ఇందులో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పాల్గొన్నారు.


60మందికిపైగా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటించగా, బీహార్ తదితర రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ నిజమేనని నిర్ధారణ కావడంతో కౌన్సెలింగ్‌ను నిలిపివేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

కమిటీ ఏర్పాటు..

రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తినడం, సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది.


మొదట నీట్‌ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్‌టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది.

అసలు ఎన్‌టీఏకు లోపాల్లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకొనే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసింది. చివరగా శనివారం రాత్రి నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

For Latest News and National News click here

Updated Date - Jun 23 , 2024 | 03:50 PM