Share News

PM Kisaan: రైతులకు శుభవార్త.. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:05 PM

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేంద్రం ఏటా ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున సాయమందిస్తోంది.

PM Kisaan: రైతులకు శుభవార్త.. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేంద్రం ఏటా ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున సాయమందిస్తోంది. 2018 డిసెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది.

డీబీటీ ద్వారా డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ప్రతి నాలుగు నెలలకొకసారి రూ. 2 వేలచొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడతలో 93 మిలియన్ల మంది రైతులు ఒక్కొక్కరు రూ.2 వేల వరకు లబ్ధిపొందారు. పీఎం కిసాన్‌కు అర్హత పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అంటున్నారు అధికారులు. ఇందుకోసం...


  • అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫార్మర్ కార్నర్.. విభాగంలోని ఈకేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేయాలి

  • 'సెర్చ్' బటన్‌పై క్లిక్ చేయాలి

  • ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.

  • ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్‌మిట్ నొక్కాలి. తద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది.

రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే..

1. eKYC పూర్తి చేయాలి.

2. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి.

3. భూమి రికార్డులను ధృవీకరించాలి.


ఆధార్‌ లింక్ తప్పనిసరి..

పీఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) వ్యవస్థ ద్వారా బదిలీ అవుతాయి. ఇందుకోసం బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. పీఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్‌, భూ రికార్డులను ధృవీకరించాల్సి ఉంటుంది.

Harsha Sai: హర్షసాయి కేసులో మరో ట్విస్ట్.. మరో ఫిర్యాదు అందుకున్న పోలీసులు

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 04:07 PM