Share News

PM Modi: జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:47 AM

ఏబీఎన్, ఇంటర్‌నెట్: ఇటలీలో ప్రతిష్టాత్మక జీ-7 సభ్యదేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంబంధాలపై చర్చలు జరపనున్నారు.

PM Modi: జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..
PM Modi

ఏబీఎన్, ఇంటర్‌నెట్: ఇటలీలో ప్రతిష్టాత్మక జీ-7 (G-7) సభ్యదేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ (Italy) వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) బిజీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Georgia Maloney)తోపాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంబంధాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో (US President Biden) నరేంద్రమోదీ భేటీ అయ్యే అవకాశముంది. కాగా ప్రతిష్టాత్మక జీ-7 సమ్మిట్ ఇటలీలో నిన్న (గురువారం) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతోపాటు జీ-7 సభ్య దేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు భారత రాయబారులు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు విమానాశ్రమంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.


జీ-7 శిఖరాగ్ర సదస్సు అనుమత సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ చేరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అక్కడి సమావేశంలో ప్రధానంగా ఏఐ ఇంధనం, మద్యధర, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే గ్లోబల్ సౌత్‌కు కీలకమైన అంశాలపై సమాలోచనలు జరపనున్నట్లు వెల్లడించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.


కాగా ప్రధాని నరేంద్రమోదీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు గురువారం ఇటలీ వెళ్లారు. ఇటీవల మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకిది తొలి విదేశీ పర్యటన. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్‌లో జూన్‌ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌, జపాన్‌ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా సంఘర్షణపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఓ సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడి గురించిన చర్చలో పాల్గొంటారు. కాగా, జీ-7 సదస్సులో మోదీ పాల్గొనడం జీ-20 ఫలితాలను అనుసరించేందుకు ఉపకరిస్తుందని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వత్రా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..

హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..

జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..

టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 14 , 2024 | 11:52 AM