Share News

Rahul Gandhi: మోదీ ఆ విషయంలో అబద్ధం చెప్పారు.. రాహుల్ విమర్శలు

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:52 PM

ప్రధాని మోదీ(PM Modi) తన కులం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharath Jodo Nyay Yatra)లో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని.. జనరల్ కేటగిరీకి(OC) చెందిన వారని ఆరోపించారు.

Rahul Gandhi: మోదీ ఆ విషయంలో అబద్ధం చెప్పారు.. రాహుల్ విమర్శలు

ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) తన కులం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharath Jodo Nyay Yatra)లో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని.. జనరల్ కేటగిరీకి(OC) చెందిన వారని ఆరోపించారు.

ఆయన తన కులం గురించి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. "మోదీ ఓబీసీ కాదు. గుజరాత్‌లోని తెలీ కులంలో జన్మించారు. 2000 సంవత్సరంలో ఆయన కులాన్ని ఓబీసీల్లోకి మార్చారు. అగ్రవర్ణ కులాల్లో జన్మించినందుకే ఆయన కులగణనకు వెనకాడుతున్నారు" అని రాహుల్ అన్నారు.


ఆయన చేపట్టిన న్యాయ్ యాత్ర గురువారం ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ పార్టీ నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ గఢ్‌లో అధికారం కోల్పోయింది. ఆ తరువాత రాష్ట్రంలో రాహుల్ తొలిసారి పర్యటిస్తున్నారు.

జనవరి 14న మణిపుర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఫిబ్రవరి 11న రాయ్‌గఢ్, శక్తి, కోర్బా జిల్లాల మీదుగా సాగనుంది. ఫిబ్రవరి 14న బలరాంపూర్ నుంచి జార్ఖండ్‌లో రాహుల్ అడుగుపెట్టనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2024 | 01:01 PM