Share News

PM Modi: మాజీ సీఎంకు ఫోన్ చేసిన మోదీ

ABN , Publish Date - Oct 07 , 2024 | 06:13 PM

రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో మాజీ సీఎంను గత శనివారం ఉదయం 9 గంటలకు జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేర్చారు.

PM Modi: మాజీ సీఎంకు ఫోన్ చేసిన మోదీ

న్యూఢిల్లీ: అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన జార్ఖాండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌ (Champai Soren)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం ఉదయం ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అభిలషించారు. చంపయి సోరెన్ సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో మాజీ సీఎంను గత శనివారం ఉదయం 9 గంటలకు జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేర్చారు.


ప్రధానికి కృతజ్ఞతలు

ప్రధానమంత్రి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడంపై సోరెన్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉందన్నారు. భగవంతుడు, తన పూర్వీకులు, వైద్యుల కృషి, ప్రజలందరి ప్రార్థనలతో కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నట్టు తెలిపారు.

India-Maldives: మీకు కష్టమొస్తే ఆదుకోవడంలో ముందుంటాం.. మాల్దీవులకు మోదీ అభయం


హేమంత్ సోరెన్ ట్వీట్

కాగా, చంపయి సోరెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ''చంపయి సోరెన్ త్వరలో కోలుకోవాలని మారంగ్ బురు (గిరిజనుల ఆరాధ్య దైవం)ను ప్రార్థిస్తున్నారు. ఆయన చిరకాల ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను'' అని హేమంత్ సోరెన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


చంపయి సోరెన్ ప్రస్థానం

జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో గత ఫిబ్రవరి 2న జార్ఖాండ్ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత జూలైలో హేమంత్ సోరెన్ బెయిలుపై విడుదల కావడంతో సీఎం పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేశారు. దీంతో తిరిగి హేమంత్ సోరెన్ సీఎం అయ్యారు. ఈ పరిణామలతో అసంతృప్తి చెందిన చంపయి సోరెన్ గత ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో బీజేపీలో చేరారు. 67 గిరిజన నేత అయిన చంపయి సోరెన్ 'జార్ఖాండ్ టైగర్'గా పేరుంది. 1990లో జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు. 2000లో బీహార్ నుంచి జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 1991లో అవిభక్త బీహార్‌లోని సరాయికేల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జేఎంఎం టిక్కెట్టుపై 2000, 2005, 2009, 2014, 2019లో వరుసగా గెలుపొందారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి...

Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 07 , 2024 | 06:13 PM